Rinku Singh | ఆసియా గేమ్స్ జట్టులో రింకూ సింగ్.. సిక్సర్ల కింగ్ ఇన్‌స్టా పోస్ట్ చూశారా..?
Rinku Singh : ఐపీఎల్ 16వ సీజన్ హీరో రింకూ సింగ్(Rinku Singh) కల ఫలించింది. వెస్టిండీస్ పర్యటనలో మొండి చేయి చూపించిన సెలెక్టర్లు అతడిని ఆసియా గేమ్స్(Asia Games) జట్టుకు ఎంపిక చేశారు. దాంతో, ఈ సిక్సర్ల కింగ్ భారత జట్టు తరఫున ఆరంగేట్రం చేయనున్నాడు. తనను సెలెక్ట్ చేయడంపై రింకూ తొలిసారి స్పందించాడు. తన కల నిజమైందనే అర్ధం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో....
Rinku Singh : ఐపీఎల్ 16వ సీజన్ హీరో రింకూ సింగ్(Rinku Singh) కల ఫలించింది. వెస్టిండీస్ పర్యటనలో మొండి చేయి చూపించిన సెలెక్టర్లు అతడిని ఆసియా గేమ్స్(Asia Games) జట్టుకు ఎంపిక చేశారు. దాంతో, ఈ సిక్సర్ల కింగ్ భారత జట్టు తరఫున ఆరంగేట్రం చేయనున్నాడు. తనను సెలెక్ట్ చేయడంపై రింకూ తొలిసారి స్పందించాడు. తన కల నిజమైందనే అర్ధం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
అందులో ఈ లెఫ్ట్ హ్యాండర్ టీమిండియా, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Rider) జట్టు జెర్సీలు వేసుకొని ఉన్నాడు. ఫొటో వెనకాల ‘ఫైనల్లీ’ అని ఇంగ్లీష్ అక్షరాల్లో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సారథ్యంలోని భారత జట్టు ఆసియా గేమ్స్‌కు వెళ్లనన్న విషయం తెలిసిందే.
టీమిండియా, కోల్‌కతా జెర్సీతో రింకూ సింగ్

ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో..
పదహారో సీజన్ ఐపీఎల్ రింకూ సింగ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులోనూ ఒకే ఒక ఇన్నింగ్స్ అతడికి చెప్పలేనంత పేరు తీసుకొచ్చింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై అఖరి ఓవర్లో రింకూ విశ్వరూపం చూపించాడు. యశ్ దయాల్(Yash Dayal) వేసిన ఆఖరి ఓవర్లో 25 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే బౌండరీలతో భయపెట్టిన రింకూ వరుసగా ఐదు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది.
రింకూ సింగ్

ఆ తర్వాతి మ్యాచుల్లోనూ రింకూ ఫినిషర్‌గా తన విధ్వంసక బ్యాటింగ్‌తో కోల్‌కతాను గెలిపించాడు. ఈ సీజన్లో అతను 474 పరుగులు చేశాడు. అయినా కూడా జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. అయితేనేం.. అతడు తన ఆటతో అభిమానులను అలరించాడు. దాంతో,రింకూ భారత జట్టులోకి చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా. అనుకున్నట్టే అతడిని సెలెక్టర్లు ఆసియా గేమ్స్ జట్టుకు ఎంపిక చేశారు.
భారత జట్టు ఇది : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షహ్బాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్).
స్టాండ్ బై ఆటగాళ్లు : యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
ఇవి కూడా చదవండి
US Open | సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సింధు
Yashasvi Jaiswal | ఆరంగ్రేటం టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు.. యశస్వీ ఏం అన్నాడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

