తాష్కెంట్: ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 49కిలోల విభాగంలో స్నాచ్(86కిలోలు), క్లీన్ అండ్ జర్క్(119కిలోలు)లో మొత్తం 205 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో హో జిహు(213కి), జియాంగ్(207కి) వరుసగా స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. క్లీన్ అండ్ జర్క్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చాను టోక్యో ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో పాటు గతేడాది నెలకొల్పిన అత్యుత్తమ వ్యక్తిగత రికార్డు(88కి+115కి)ను చాను తాజాగా తిరుగరాసింది.