ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో తలకు గాయమైన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉంటుందని సమాచారం. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షబ్నీమ్ ఇస్మాయిల్ వేసిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన తలకు తగిలింది. దీంతో వెంటనే మైదానంలోకి వచ్చిన జట్టు ఫిజియో.. మంధానకు తగిలిన దెబ్బను పరిశీలించారు.
ఆ తర్వాతి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్‌గా మంధాన పెవిలియన్‌కు వచ్చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో ఆమె తలకు పెద్ద గాయమైందేమో? అని అభిమానులు ఆందోళన చెందారు. ప్రపంచకప్ వంటి కీలకమైన టోర్నీ ముందు మంధాన వంటి స్టార్ బ్యాటర్ జట్టుకు దూరమైతే టీమిండియాకు చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.
అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు తెలిపాయి. వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ ఆడే జట్టులో మంధాన ఉంటుందని తెలుస్తోంది. కాగా, భారత మహిళల జట్టు ఆదివారం నాడు పాకిస్తాన్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
🚨 UPDATE 🚨: Smriti Mandhana stable after being struck on the head in #CWC22 warm-up game. #TeamIndia
Details 🔽
— BCCI Women (@BCCIWomen) February 28, 2022