ఒదెన్స్ (డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్, చిరాగ్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది.
శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో భారత షట్లర్లు.. 21-23, 21-18, 16-21తో టకురొ హొకి, యుగొ కొబయాషి (జపాన్) ద్వయం చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.