కౌలాలంపూర్: ఇండోనేషియాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత స్కాష్ ప్లేయర్లు సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లలో ముగ్గురు ఆటగాళ్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 17 ఏండ్ల అన్హత్ సింగ్.. 3-0తో అకారి మిడొరికవ (జపాన్)ను చిత్తుచేసింది. మరో పోరులో రెండో సీడ్ ఆకాంక్ష.. వాయి యణ్ యీంగ్ (సింగపూర్)ను ఓడించింది.
పురుషుల సింగిల్స్‌లో వీర్ చొత్రాని.. 3-1తో మహ్మద్ సిఫిక్ కమల్ (ఇండోనేషియా)పై గెలిచాడు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన వాళ్లు వచ్చేనెల 9 నుంచి చికాగోలో జరుగబోయే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌నకు అర్హత సాధిస్తారు.