INDW vs SAW : భారత స్పిన్లర్లు రంగంలోకి దిగడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. స్నేహ్ రానా ఓవర్లో మరినే కాప్(20) బౌల్డ్ కాగా.. ఆ తర్వాతి ఓవర్లో అన్నెకే బాస్చ్(1)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది దీప్తి శర్మ. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు పడడంతో సఫారీ జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. 58 కే నాలుగు వికెట్లు పడిన వేళ .. జట్టును గెలిపించేందుకు కెప్టెన్ లారా వొల్వార్త్డ్(34) పోరాడుతోంది. ఆమెకు సినాలో జఫ్తా(6) అండగా ఉంది. 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్..68/4.
వైజాగ్‌లో భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒకే రన్ ఇచ్చిన క్రాంతి గౌడ్ తన రెండో ఓవర్లోనే బ్రేకిచ్చింది. న్యూజిలాండ్‌పై సెంచరీతో సఫారీలను గెలిపించిన తంజిమ్ బ్రిట్స్(0) వికెట్ పడగొట్టిందీ పేసర్. బ్రిట్స్ స్ట్రెయిట్‌గా ఆడిన బంతిని గ ఒడుపుగా ఎడమచేత్తో క్యాచ్ అందుకుంది.
Outfoxed 🔥#INDvSA
Sneh Rana cleans up Marizanne Kapp with a splendid delivery.#TeamIndia pick up their 3️⃣rd wicket
Updates ▶️ https://t.co/G5LkyPu4gX#WomenInBlue | #CWC25 | #INDvSA | @SnehRana15 pic.twitter.com/B7DHFtpfuX
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
ఆ తర్వాత గత మ్యాచ్‌లో అజేయంగా నిలిచిన సునే లుస్(5)ను అమన్‌జోత్ ఔట్ చేసింది. వరసుగా రెండు వికెట్లు పడిన జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది మరినే కాప్(20). కెప్టెన్ లారా వొల్వార్డ్త్తో కలిసి స్కోర్‌బోర్డును నడిపించింది. కానీ, స్నేహ్ రానా ఆమెను క్లీన్ బౌల్డ్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాతి ఓవర్లో అన్నెకె బాస్చ్ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది దీప్తి శర్మ.