న్యూఢిల్లీ : భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు హర్భజన్ సింగ్. భారత్ తరపున 23 ఏండ్ల పాటు హర్భజన్ సింగ్ క్రికెట్ ఆడారు. తన అభిమానులందరికీ హర్భజన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 103 టెస్టులు, 236 వన్డేలు ఆడారు హర్భజన్. 1998లో ఆస్ట్రేలియా మ్యాచ్‌తో టెస్టుల్లో సింగ్ అరంగ్రేటం చేశారు. 2015లో శ్రీలంకతో చివరి టెస్టు ఆడారు. టెస్టుల్లో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు చేశారు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269 వికెట్లు తీశారు హర్భజన్ సింగ్. టెస్టుల్లో 25 సార్లు 5 వికెట్లు తీశాడు.
టీమిండియాలో సక్సెస్ఫుల్ బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. ఆఫ్ స్పిన్నింగ్ బౌలింగ్ వేయాలంటే హర్భజన్ సింగ్ తర్వాతనే ఎవరైనా. దాదాపు 23 ఏళ్ల పాటు టీమిండియా తరుపున ఆడిన స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్.. తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ వీడియో ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు హర్భజన్ స్పష్టం చేశాడు.
నేను ఎప్పుడైతే మైదానంలోకి అడుగు పెడతానో.. జెర్సీ వేసుకుంటానో.. ఆ సమయంలో నాకు ఆట తప్పించి ఇంకేం కనిపించదు. జెర్సీనే నాకు పెద్ద మోటివేషన్. కానీ… కొన్ని సార్లు జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా. కానీ.. ఆ రోజు రానే వచ్చింది.. అంటూ హర్భజన్ సింగ్ యూట్యూబ్ వీడియోలో తెలిపారు.
ప్రస్తుతం హర్భజన్ సింగ్.. ఐపీఎల్లో తప్పితే మరే క్రికెట్ ఫార్మాట్లో ఆడటం లేదు. చాలా రోజుల నుంచి హర్భజన్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. తను ఇక శాశ్వతంగా క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని అనుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.