ఫిన్లాండ్: ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టైటిల్ వేటలో తడబడుతున్న భారత షట్లర్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫిన్లాండ్లో మంగళవారం నుంచి ఆర్క్టిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నీ ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జితో పాటు యువ సంచలనం అయుష్ శెట్టి, హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో తాన్య హేమంత్, అన్మోల్ ఖర్బ్ పోటీలో నిలిచారు.