జకర్తా : గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై నిరాశపరుస్తున్న భారత షట్లర్లు మరోసారి తమ వైఫల్య ప్రదర్శనను కొనసాగించారు. ఇండోనేషియా మాస్టర్స్‌లో లక్ష్యసేన్‌తో పాటు సాత్విక్-చిరాగ్ జోడీ ప్రిక్వార్టర్స్‌లోనే ఓడటంతో ఈ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం 20-22, 21-23తో కెడ్రెన్-డెకపొల్ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్స్ చేరిన తనీషా-ధ్రువ్ జంట 21-18, 15-21, 19-21తో పాంగ్ రొన్ హో-సు యిన్ చెంగ్ చేతిలో చిత్తైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్ 16-21, 21-12, 21-13తో నిషిమొటో(జపాన్) చేతిలో పరాభవం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా-పొన్నప్ప 21-13, 22-24, 18-21తో పీ కీ గొ-మె జింగ్ (మలేషియా) ద్వయానికి తలవంచింది.