యోకోహమా(జపాన్): జపాన్ ఓపెన్లో భారత షట్లర్లు అశ్మిత చాలిహా, మాళివిక బన్సోద్ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో అశ్మిత 16-21, 12-21తో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది. ఏ దశలోనూ తైజుకు పోటీనివ్వలేకపోయిన అశ్మిత వరుస గేముల్లో మ్యాచ్ను చేజార్చుకుంది. మరో పోరులో మాళవిక 21-23, 19-21తో పొలినా బుహ్రోవా(ఉక్రెయిన్)పై పోరాడి ఓడింది. వీరిని అనుసరిస్తూ ఆకర్షి కశ్యప్ 13-21, 12-21తో కిమ్ గ ఉన్(కొరియా)పై పరాజయం పాలైంది.