షెన్జెన్ (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె.. 21-4, 21-10తో డెన్మార్క్‌కు చెందిన జాకొబ్సెన్పై అలవోక విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆయుష్.. 19-21, 21-12, 16-21తో చొ టీన్ చెన్ (చైనీస్ తైఫీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్-రుత్విక ద్వయం 17-21, 11-21తో షిమొగమి-హొబర (జపాన్) జోడీ చేతిలో ఓడింది.