న్యూఢిల్లీ: ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ 252 పాయింట్లతో పసిడి పతకంతో మెరువగా, మిసాకి(జపాన్, 251.5), మేఘన(229.5) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
మహిళల టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్, ఆర్య బోర్సె, మేఘన సజ్జనార్ త్రయం 1892 స్కోరుతో పసిడి ఖాతాలో వేసుకుంది.