షుల్(జర్మనీ): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో యువ షూటర్ నరేన్ ప్రణవ్ కాంస్య పతకంతో మెరిశాడు. ఇటీవలే ఖేలోఇండియా యూత్గేమ్స్లో మెరిసిన ప్రణవ్ 227.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
హువాంగ్ లివాలిన్(250.3, చైనా), బ్రాడెన్ పీజర్(250.0, అమెరికా) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ వరల్డ్ చాంపియన్ పీజర్, వరల్డ్ కప్ రజత విజేత హువాంగ్ లాంటి స్టార్ షట్లర్లతో కడదాకా పోరాడిన ప్రణవ్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.