వియత్నాం : 25వ ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత రోయర్లు సత్తా చాటారు. ఈ నెల 16 నుంచి 19 దాకా జరిగిన పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 2 కాంస్యాలు సాధించి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల బృందం రజతం గెలుచుకుని రికార్డులకెక్కింది. ఉమెన్స్ లైట్‌వెయిట్ కాక్స్లెస్ఈవెంట్లో గుర్బానీ కౌర్, దిల్జోత్ కౌర్ ద్వయం 7:51.374 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రజతం సాధించారు.
మెన్స్ సింగిల్స్ స్కల్స్లోబాల్రాజ్ పన్వర్ స్వర్ణం గెలువగా లైట్‌వెయిట్ మెన్స్ డబుల్స్ స్కల్స్‌లో అజయ్, లక్ష్య ద్వయం పసిడి సాధించింది. మెన్స్ క్వాడ్రాపుల్ స్కల్స్‌లో కుల్వీందర్, నవ్‌దీప్, సత్నాం, జకార్ ఖాన్ స్వర్ణం గెలుచుకున్నారు.