మునిచ్ (జర్మనీ): ఏటీపీ-500 ఈవెంట్ అయిన బెవెరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు రోహన్ బోపన్న, బెన్ షెల్టన్ (అమెరికా) జోడీ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. సోమవారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఈ ఇండో-అమెరికన్ ద్వయం 6-4, 6-3తో జెమీ ముర్రే (ఇంగ్లండ్)-రాజీవ్ రామ్ (అమెరికా)ను ఓడించింది. ఇదే టోర్నీలో మరో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు.