ఢిల్లీ : వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ ట్యూనిషియా -2026 టోర్నీలో భారత మిక్స్డ్ డబుల్ ద్వయం మనూష్ షా, దివ్య చిటాలె రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్ ఫైనల్స్‌లో భారత జోడీ.. 1-3 (9-11, 13-11, 10-12, 5-11)తో రుబెల్స్, మారియా (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది.
పురుషుల డబుల్స్‌లో మనూష్, హర్మీత్ దేశాయ్ జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రెండో సీడ్ భారత ద్వయం.. శనివారం రాత్రి ముగిసిన సెమీస్‌లో 3-2 (9-11, 5-11, 11-7, 11-5, 11-8)తో భారత్‌కే చెందిన స్నేహిత్-ఆకాశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.