Mohammed Shami | న్యూఢిల్లీ: భారత సీనియర్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పటికే టీమ్ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇదే తరహాలో బెదిరింపులు రాగా, తాజాగా షమీకి రాజ్‌పుత్ సింధార్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపాడు. కోటి రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన షమీ సోదరుడు మహమ్మద్ హసీబ్.. అమ్రోహా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
ఈ నెల 4వ తేదీన వచ్చిన మెయిల్‌పై అమ్రోహా పోలీసులు సైబర్ సెల్లో కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కర్ణాటకకు చెందిన ప్రభాకర్ అని తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజా ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న షమీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.