డల్లాస్: టీ20 వరల్డ్‌కప్‌లో గురువారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా జట్టు అద్భుత విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. సూపర్ ఓవర్లో అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్( Saurabh Netravalkar) వేసిన బౌలింగ్ పాకిస్థాన్‌ను ఇరకాటంలో పడేసింది. సూపర్ ఓవర్లో 19 రన్స్ అవసరం కాగా, నేత్రావల్కర్ తన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను అడ్డుకున్నారు. కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చాడతను. చాలా కూల్‌గా.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
నేత్రావల్కర్ ఒకప్పుడు ఇండియన్ జెర్సీలో ఆడాడు. 1991, అక్టోబర్ 16వ తేదీన ముంబైలో పుట్టిన అతను 2010 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఆ తర్వాత ఇండియాలో అతను తన ట్యాలెంట్‌తో మరింత ముందుకు వెళ్లలేకపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేసే అతను .. ఎటువంటి పిచ్‌పైనా అయినా పేస్, బౌన్స్‌ను రాబట్టగలడు. అండర్-19 క్రికెటర్ అయిన నేత్రావల్కర్.. 2015లో అమెరికాకు వెళ్లాడు. 9 ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డాడు. అమెరికాలో క్రికెట్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. గతంలో అతను ముంబై రంజీ జట్టు తరపున ఆడాడు కూడా. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్, సందీప్ శర్మతోనూ కలిసి ఆడాడు.
కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, నేత్రావల్కర్ మంచి ఇంజినీర్ కూడా. స్పోర్ట్స్‌తో పాటు ప్రొఫెషన్‌ను అతను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఒరాకిల్ సంస్థలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ఆ సంస్థకు కోడింగ్ చేస్తూ .. తనలో ఉన్న క్రికెట్ పట్ల ఇష్టాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో కీలక దశలో అతను రాణించిన తీరు అందర్నీ అట్రాక్ట్ చేసింది.
2010లో అండర్19 జట్టుకు ఆడినప్పుడు వరల్డ్‌కప్ టోర్నీలో యువ బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టు చేతిలో ఇండియా ఓడిపోయింది. అప్పుడు ఇండియాకు ఆడిన నేత్రావల్కర్ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత పాక్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అమెరికా క్రికెట్ జట్టులో ఇప్పుడు అతను కీలక సభ్యుడు అయ్యాడు.
He is Saurabh Netravalkar, who led the USA to victory against Pakistan in a super over #PakvsUSA pic.twitter.com/vKq6YkopPE
— Meme Farmer (@craziestlazy) June 6, 2024