Asian Hockey Championship | చెన్నై: ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, జపాన్ మధ్య పోరు 1-1తో డ్రాగా ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ స్థాయికి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న టీమ్ఇండియాకు 19వ ర్యాంక్ టీమ్ జపాన్ దీటైన పోటీనిచ్చింది.
ఆది నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో టీమ్ఇండియా సఫలం కాలేకపోయింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్‌సింగ్(43ని) ఏకైక గోల్ చేయగా, కెన్ నగయోషి(28ని) జపాన్‌కు గోల్ అందించాడు. భారత్, మలేషియాతో ఆదివారం తలపడుతుంది.