పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో అర్జెంటీనాతో జరిగిన హాకీ మ్యాచ్ డ్రా అయ్యింది. చివరి నిమిషంలో ఇండియా స్కోర్ చేయడంతో 1-1 తేడాతో మ్యాచ్ డ్రా అయ్యింది. పూల్ బీ హాకీ మ్యాచ్‌లో.. ఆఖరిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఇండియాకు ఆశను నింపారు. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందన్న సమయంలో ఆ అద్భుతం చోటుచేసుకున్నది.
ఆరంభంలో అర్జెంటీనా తరపున 22వ నిమిషంలో లూకాజ్ మార్టినేజ్ గోల్ చేశాడు. మొదటి నుంచి రెండు జట్లు తీవ్రంగా గోల్ కోసం పోటీపడ్డాయి. కానీ ఓ దశలో ఇండియా వెనుకంజలో ఉన్నది. అర్జెంటీనా దూకుడుగా ఆడింది. ఇండియాకు పెనాల్టీ కార్నర్లు వస్తున్నా.. వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. ఇక ఆట 5 నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో.. ఇండియా గోల్‌కీపర్ శ్రీజేశ్ కూడా రంగంలోకి దిగాడు.
శనివారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా తన తదుపరి మ్యాచుల్లో బలమైన ఆస్ట్రేలియా, బెల్జియం జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
India 1️⃣ – 1️⃣ Argentina
After India was trailing in most parts of the Game, Captain Haramanpreet converts import Penalty Corner into a brilliant Goal….!!!! 🇮🇳♥️#Paris2024 #Hockey pic.twitter.com/EmflC7PcOI
— The Khel India (@TheKhelIndia) July 29, 2024