అడిలైడ్: భారత హాకీ జట్టు ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాపై అనూహ్య విజయం సాధించింది. బుధవారం జరిగిన మూడో టెస్టులో భారత్ 4-3 తేడాతో గెలిచింది. దీనితో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా చేతిలో 7-0తో ఓడిన భారత జట్టు ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 4-5తో, రెండో టెస్టులో 4-7తో ఓడిపోయింది.
భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(12ని.), అభిషేక్(47ని.), షంషేర్ సింగ్(57ని.), ఆకాష్దీప్ సింగ్(60ని.) గోల్స్ సాధించగా, ఆసీస్ జట్టులో జాక్ వెల్చ్(25ని.)), కెప్టెన్ అరన్ జలెస్కి(32ని.), నాథన్ ఎఫ్రామ్స్(59ని.) గోల్స్ చేశారు. సిరీస్‌లో నాలుగు, అయిదో టెస్టులు శని, ఆది వారాల్లో జరుగనున్నాయి.