ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్లాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బీసీసీఐ ఈ ఫొటోలను తన ట్విటర్లో షేర్ చేసింది. మెన్స్ కెప్టెన్ కోహ్లి, వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తోపాటు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఝులన్ గోస్వామిలాంటి వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. అయితే సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.
మెన్స్ టీమ్ న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అటు వుమెన్స్ టీమ్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఇంగ్లండ్ టీమ్‌తో తలపడనుంది. జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు కెప్టెన్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఏ టీమ్ ఒక్కో సెషన్, ఒక్కో గంట మెరుగైన ఆట ఆడుతుందో ఆ టీమ్‌దే చాంపియన్‌షిప్ అని కోహ్లి అన్నాడు. ఇంగ్లండ్ కండిషన్స్ తమతోపాటు న్యూజిలాండ్‌కు కూడా ఒకేలా ఉంటాయని, ఆ లెక్కన రెండు టీమ్స్ సమవుజ్జీలుగానే ఉన్నట్లు అతను చెప్పాడు.
అటు వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఫ్లైట్ ఎక్కే ముందు మీడియాతో మాట్లాడింది. తమలో చాలా మంది చాలా రోజుల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నట్లు చెప్పింది. మెన్స్ టీమ్ కూడా తమతోపాటే ఉండట వల్ల.. యూకేలో ఎలా ఆడాలో వాళ్లను అడిగి తెలుసుకుంటామని తెలిపింది. వాళ్లతో సమయం దొరికినప్పుడల్లా తమ టీమ్ ప్లేయర్స్ మాట్లాడుతూనే ఉన్నారని మిథాలీ చెప్పింది.
#TeamIndia pic.twitter.com/mhmyJFc0H8
— BCCI (@BCCI) June 2, 2021
🗣️ Happy to have the opportunity to play the World Test Championship Final: #TeamIndia Captain @imVkohli ☺️ pic.twitter.com/jjFEwEisrD
— BCCI (@BCCI) June 2, 2021
💬💬 #TeamIndia Head Coach @RaviShastriOfc on whether the ICC World Test Championship Final is like playing the World Cup Final. pic.twitter.com/hAp0yCUqeO
— BCCI (@BCCI) June 2, 2021