అంట్వెర్ప్(బెల్జియం): ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు దాదాపు నిష్క్రమించాయి. శనివారం జరిగిన తమ 10వ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-6 తేడాతో బెల్జియం చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది. బెల్జియంకు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయిన టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది. దీంతో టోర్నీలో 15 మ్యాచ్‌లాడిన భారత్ ఐదు గెలిచి పదింటిలో ఓడి ప్రస్తుతం 15 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నది.
మ్యాచ్ విషయానికొస్తే భారత్ తరఫున దిల్‌ప్రీత్‌సింగ్, మన్‌దీప్‌సింగ్, అమిత్రోహిదాస్ ఒక్కో గోల్ చేశారు. మహిళల విభాగంలోనూ మన అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ 1-5తో బెల్జియం చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొంది. దీపిక(6ని) భారత్‌కు ఏకైక గోల్ అం దించింది. లీగ్‌లో 13 మ్యాచ్‌లాడిన మహిళల జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.