వుంగ్ తౌ (వియత్నాం): అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుష రెజ్లర్లూ సత్తా చాటారు. వియత్నాంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల విభాగంలో ఇప్పటికే భారత్.. టీమ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోగా ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలోనూ మన రెజ్లర్లు టీమ్ టైటిల్ సొంతం చేసుకున్నారు. బరిలోకి దిగిన పది కేటగిరీల్లోనూ ఒక పతకం సాధించడంతో ఈ ఘనత దక్కింది.
నిఖిల్ (61 కిలోలు), సుజీత్ (65 కి.), జైదీప్ (74 కి.), చందర్ మోహన్ (79 కి.), సచిన్ (92 కి.), విక్కీ (97 కి.) స్వర్ణాలతో మెరవగా జస్పూరన్ సింగ్ (125 కి.) రజతం గెలిచాడు. గ్రీకో రోమన్ విభాగంలోనూ భారత జట్టుకు ఒక పసిడితో పాటు రెండు కాంస్యాలు దక్కిన విషయం తెలిసిందే.