కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. గతంలో ఎన్నడూ సాధ్యం కాని రీతిలో ఈ సారి మన షూటర్లు అదిరిపోయే గురితో సత్తాచాటారు.
కైరో వేదికగా బుధవారం ముగిసిన ఈ పోటీల్లో భారత షూటర్లు మొత్తం 38 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. దీంతో పాటు మూడు ఒలింపిక్స్ (2024) బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఈ మెగాటోర్నీలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 4 పతకాలతో విజృంభించిన విషయం తెలిసిందే.