Paris Olympics 2024 : విశ్వ క్రీడల్లో భారత పురుషుల హకీ జట్టు అద్వితీయ విజయంతో కాంస్యం (Bromze Medal) కొల్లగొట్టింది. పసిడి వేటలో తడబడిన టీమిండియా కంచు పోరులో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) డబుల్ గోల్‌తో స్పెయిన్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి నాలుగో మెడల్ అందించడంతో పాటు 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించింది.
ఒకానొక సమయంలో ప్రపంచ హాకీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. ధ్యాన్ చంద్(Dhyan Chand) హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1972లో మ్యూనిచ్ (జర్మనీ) ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 52 ఏండ్లకు వరుసగా రెండు కాంస్యాలతో భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా విశ్వ క్రీడల హాకీలో భారత జట్టు పతకాల సంఖ్యను 13కు చేర్చింది. దాంతో, యావత్ దేశం హాకీ యోధుల చిరస్మరణీయ విజయాన్నిసంబురంగా కీర్తిస్తోంది.
🥉 𝑽𝒊𝒄𝒕𝒐𝒓𝒚 𝑺𝒆𝒂𝒍𝒆𝒅 𝒊𝒏 𝑩𝒓𝒐𝒏𝒛𝒆: 𝑰𝒏𝒅𝒊𝒂’𝒔 𝑯𝒐𝒄𝒌𝒆𝒚 𝑻𝒆𝒂𝒎 𝑹𝒊𝒔𝒆𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝑶𝒄𝒄𝒂𝒔𝒊𝒐𝒏 ✨
Congratulations to the Indian Men’s Hockey Team for clinching the bronze medal at #Paris2024. 🏑
A thrilling victory against Spain, showcasing true… pic.twitter.com/zt8mguCyig
— Odisha Sports (@sports_odisha) August 8, 2024
ఆద్యంతం రఫ్పాడించిన భారత హాకీ జట్టు కాంస్యం మ్యాచ్‌లోనూ చెలేగింది. తొలి అర్ధ భాగంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. కాసేపట్లో తొలి అర్ధ భాగం ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అంతే.. 1-1తో స్కోర్ సమం అయింది.
🇮🇳🥉 𝗕𝗥𝗜𝗟𝗟𝗜𝗔𝗡𝗧 𝗕𝗥𝗢𝗡𝗭𝗘! Many congratulations to the men’s hockey team on securing a second consecutive Olympic Bronze medal after previously winning it at 🇯🇵 Tokyo 2020.
🔥 The Indian men’s hockey team last won back-to-back Bronze medals in the 1968 and 1972… pic.twitter.com/Yl4gQpj7vI
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
అనంతరం రెండో అర్ధభాగం మొదలవ్వగానే భారత సారథి మళ్లీ పెనాల్టీ కార్నర్‌ను స్పెయిన్ గోల్ కీపర్ కళ్లుగప్పి గోల్స్ కొట్టాడు. దాంతో, భారత జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత డిఫెండర్లు స్పెయిన్ ఫార్వర్డ్స్‌ను సమర్ధంగా నిలువరించారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ, భారత వాల్ శ్రీజేష్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు. దాంతో, టీమిండియా వరుసగా రెండో పర్యాయం కూడా కాంస్యాన్ని నిలబెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4తో గెలుపొందిన భారత్ కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
The Man. The Myth. The Legend. The G.O.A.T
P.R. Sreejesh finishes with a 🥉 in his final game! #ThankYouSreejesh #Paris2024 #Hockey #HockeyIndia pic.twitter.com/CCLZXKyy3y
— Hockey India (@TheHockeyIndia) August 8, 2024