Pushkar Singh Dhami : కేంద్ర ప్రభుత్వం లోక్సభలో గురువారం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న వివాదాస్పద భూముల కేసులు చాలా ఉన్నాయని ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఈ తరహా అక్రమ కార్యకలపాలకు తెరపడుతుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులను అడ్డుకోవడమే విపక్షాల పనిగా తయారైందని విమర్శించారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు.
ఉత్తరాఖండ్లో అక్రమ భూ ఆక్రమణలను విముక్తి చేసే డ్రైవ్ కొనసాగుతున్నదని తెలిపారు. వర్షాల కారణంగా ఈ కార్యక్రమం ఆగిందని, వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ డ్రైవ్ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్లో ఇప్పటివరకూ ఆక్రమణలకు గురైన 5000 ఎకరాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించామని తెలిపారు. కాగా, వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
అసలు మోదీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు. ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్ని అయినా రూపొందించారా అని ప్రశ్నించారు.ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పధకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను రద్దు చేసింది. మదర్సాలకు నిధులను నిలిపివేసిందని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వం కాదని ఆజాద్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని విస్మరించి వారు ఎలా ముందుకెళతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తాము ఎట్టిపరిస్ధితుల్లో మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు.
Read More :
Jagdeep Dhankhar: విపక్ష సభ్యులకు దండం పెట్టి.. రాజ్యసభ నుంచి చైర్మెన్ వాకౌట్.. వీడియో