మధురై : ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో భారత హాకీ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన పూల్-బీ మ్యాచ్‌లో భారత్.. 5-0తో స్విట్జర్లాండ్‌పై ఘనవిజయాన్ని అందుకుని క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశమే ఇవ్వని భారత్.. స్విట్జర్లాండ్తోనూ అదే దూకుడును కొనసాగించింది. భారత్ తరఫున మన్మీత్ సింగ్ (2, 11వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారి (13, 54) తలా రెండు గోల్స్ చేయగా అర్ష్‌దీప్ సింగ్ (28) ఒక గోల్ కొట్టాడు.