ఢిల్లీ: సారథి హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయడంతో జర్మనీతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను భారత హాకీ జట్టు 5-3తో గెలుచుకుంది.జర్మనీ తరఫున మజ్కోర్ (7, 57వ ని.) రెండు గోల్స్ చేయగా మెర్ట్జెన్స్ (60 ని.) ఓ గోల్ కొట్టాడు. తొలి అర్ధ భాగంలో గోల్స్ నమోదుచేయలేకపోయిన భారత్.. సెకండాఫ్‌లో మాత్రం రాణించింది. సుఖ్జ్యోత్ (34,48 ని.), హర్మన్‌ప్రీత్ (42, 43 ని.), అభిషేక్ (45ని.) గోల్స్ చేశారు. సిరీస్ డ్రా తో విజేతను నిర్ణయించే షూటౌట్లో భారత్ 1-3తో ఓడటంతో జర్మనీనే గెలిచింది.