ఓస్లో (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్మాస్టర్లుడి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్ విజయంతో ఆరంభించారు. ప్రపంచ చాంపియన్ గుకేశ్.. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌తో దాదాపు 5 గంటల పాటు సాగిన హోరాహోరీ మారథాన్ పోరులో విజయం సాధించాడు. ఇద్దరి మధ్య క్లాసికల్ గేమ్ 144 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. కానీ, అర్మగెడాన్ టైబ్రేకర్ నిర్ణయాత్మక గేమ్‌లో గుకేశ్ తన వ్యూహాత్మక ఎత్తుతో కీమర్‌ను చిత్తు చేసి 1.5 పాయింట్లు దక్కించుకున్నాడు.
అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోను కూడా ప్రజా అర్మగెడాన్లో ఓడించాడు. మరోవైపు నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్సన్.. క్లాసికల్ గేమ్‌లోనే ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరూజా చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో దివ్య .. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)ను అర్మగెడాన్ టైబ్రేకర్ ఓడించి ఔరా అనిపించగా.. కోనేరు హంపి క్లాసికల్ గేమ్‌లోనే అసౌబయేవా చేతిలో ఓడి నిరాశపరిచింది.