సమర్కంద్ (ఉజ్బెకిస్థాన్) : భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఆఖరి రౌండ్ (11)లో ఆమె.. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగ్యీతో గేమ్‌ను డ్రా చేసుకుంది.
ఈ డ్రాతో పాయింట్ల పట్టికలో వైశాలి 8 పాయింట్లతో రష్యన్ అమ్మాయి క్యాటెరీనా లాగ్నోతో సమానంగా నిలిచింది. కానీ టైబ్రేక్ స్కోరు పరంగా వైశాలి టైటిల్ నెగ్గింది. ఈ టైటిల్ గెలవడం వైశాలికి ఇది వరుసగా రెండోసారి. తద్వారా ఆమె వచ్చే ఏడాది జరుగబోయే ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది.