న్యూఢిల్లీ: హైదరాబాద్ వేదికగా మలేషియాతో జరిగే స్నేహపూర్వక మ్యాచ్ కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) మంగళవారం 26 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. గత జనవరి నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న డిఫెండర్ సందేశ్ జింగాన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా ఏషియన్ కప్‌తో పాటు ఐఎస్ఎల్ టోర్నీకి జింగాన్ పూర్తిగా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న జింగాన్..భారత్‌కు కీలకం కానుంది. ఇగోర్ స్టిమాక్ స్థానంలో జట్టు చీఫ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న మనాలో మార్వెజ్ ఇప్పటి వరకు తొలి గెలుపు కోసం ఇంకా వేచిచూస్తున్నాడు. ఈ నెల 18న భారత్-మలేషియా మధ్య గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుంది.