న్యూఢిల్లీ: ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత సైక్లిస్టులు అదరగొడుతున్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్యం దక్కాయి. పారా సీ2 15కి.మీ స్క్రాచ్ ఫైనల్లో అర్శద్ షేక్ పసిడి పతకంతో మెరువగా, జలాలుద్దీన్ అన్సారీ రజతం కైవసం చేసుకున్నాడు.
మహిళల సీ2 15కి.మీల స్క్రాచ్ రేసులో జ్యోతి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. సీ3 క్లాస్ 15కి.మీ స్క్రాచ్ తుది పోరులో పవన్‌కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు.