దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా(India Vs Pakistan) ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటన తర్వాత రెండు దాయాది దేశాలు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు .. పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేసేందుకు నిరాసక్తత ప్రదర్శించారు. దీన్ని పాకిస్థాన్ జట్టు ఖండించింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ముందు తన నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి ఆలస్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనిపై ప్రకటన రిలీజ్ చేసింది. టీమిండియా చర్యలు క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉన ్నట్లు పీసీబీ ఆ స్టేట్మెంట్లో చెప్పింది.
ఆదివారం దుబాయ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసు కున్నాయి. భారత్, పాక్ కెప్టెన్లు టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఆఘాలు.. క రచాలనం చేయకుండానే టాస్‌లో పాల్గొని వెళ్లిపోయారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్లు సైలెంట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. టార్గెట్ 128 చేసే క్రమంలో భారీ సిక్సర్‌తో సూర్య ఇన్నింగ్స్ ముగించేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత సాధారణంగా ప్రత్యర్థి జట్ల ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇస్తారు. కానీ సూర్య, దూబేలు.. పాక్ క్రికెటర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. గెలిచిన, ఓడిన జట్ల ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు.
భారత క్రికెటర్లు ప్రవర్తించిన తీరు పట్ల పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం అని ఆయన అన్నారు. నిరసనలో భాగంగా తమ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని ఆయన స్టేట్మెంట్లో తెలిపారు.
పాకిస్థాన్ క్రికెటర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ స్పందించారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.