వడోదర: భారత క్రికెట్ జట్టులోని మరో ప్లేయర్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇటీవలే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాగా.. ఇప్పుడు స్టార్ బౌలర్ అక్షర్ పటేల్ తన ప్రియురాలు మెహా పటేల్ మెడలో తాళికట్టాడు. వడోదరలో కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా వారి వివాహం జరిగింది.
ఈ వివాహ వేడుకలో వధూవరులిద్దరూ తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. అక్షర్‌పటేల్, మెహా పటేల్‌లు చాలాకాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది జనవరిలో వారి నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు గుజరాత్లో అక్షర్ స్వస్థలం వడోదరలో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మెహా పటేల్ వారి వివాహ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది. వాటిపై ఓ లుక్కేద్దామా..
MR. & MRs. Axar Patel.#AxarPatel #weddingnight pic.twitter.com/LxDYLd8fGd
— Meha Patel (@Meha2026) January 26, 2023
Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k
— Meha Patel (@Meha2026) January 26, 2023
కాగా, అక్షర్ పటేల్ శ్రీలంకతో సిరీస్‌లో భారత జట్టుతోనే ఉన్నాడు. అయితే పెళ్లి నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, అక్షర్‌పటేల్ ఇప్పటివరకు కూడా తన పెళ్లికి సంబంధించిన ఒక్క వీడియోను కూడా షేర్ చేయలేదు. మెహాపటేల్ మాత్రం కొన్ని వీడియోలను, ఫొటోలను షేర్ చేసింది.