న్యూయార్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న ఓపెన్ స్కాష్ క్లాసిక్ ఈవెంట్లో భారత స్కాష్ ఆటగాళ్లు వెల్వన్ సెంథిల్‌కుమార్, వీర్ ఛొత్రాని, రమిత్ ఠాండన్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ప్రపంచ 45వ ర్యాంకర్ సెంథిల్‌కుమార్.. 7-11, 6-11, 4-11తో లియోనల్ కార్డెనస్ (మెక్సికో) చేతిలో ఓడగా..
అడ్రియన్ 6-11, 11-9, 11-8, 8-11, 11-7తో ఎనిమిదో సీడ్ రమిత్ను ఓడించాడు. వీర్ 1-11, 8-11, 5-11తో విక్టర్ క్రొయిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.