నోయిడా : స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజూ మన బాక్సర్లు ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లారు.
పురుషుల 55 కిలోల విభాగంలో పవన్ బర్తాల్, హితేశ్ గులియా (70 కి.), సుమిత్ (75 కి.), నవీన్ (90 కి.), జాదుమణి సింగ్ (50 కి.) సత్తాచాటి పతకాలు ఖాయం చేశారు. ఈ టోర్నీలో ఇప్పటికే నలుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరగా తాజాగా ఆ సంఖ్య 9కు చేరింది.