INDW vs SAW : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. టాస్ ఓడిన సఫారీలను వణికిస్తూ పవర్ ప్లేలోనే శ్రేయాంక, పూజాలు బ్రేక్ ఇవ్వగా.. సీనియర్ స్పిన్నర్ డేంజరస్ తంజిమ్ బ్రిట్స్(20)ను వెనక్కి పంపి మరింత జోష్ నింపింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్ల పడడంతో పర్యాటక జట్టు కష్టాలు పెరిగాయి. ప్రస్తుతం ఎలెనె బొస్చ్(13), కొలే ట్రయాన్(4)లు ఆడుతున్నారు. 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్.. 57/3.
టాస్ ఓడిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. గత రెండు మ్యాచుల్లో తేలిపోయిన ఇండియన్ బౌలర్లు పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ లారా వొల్వార్డ్త్(9)ను ఔట్ చేసిన శ్రేయాంక పాటిల్ ఇండియాకు బ్రేకిచ్చింది.
What a catch! 👌👌
Captain @ImHarmanpreet with a splendid fielding effort to dismiss Tazmin Brits 👏👏@Deepti_Sharma06 strikes ⚡️⚡️
Follow the match ▶️ https://t.co/NpEloo68KO#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/uW9sp32q66
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
ఆ తర్వాత డేంజరస్ మరిజానే కాప్(10)ను పూజా వస్త్రాకర్ బౌన్సర్‌తో బోల్తా కొట్టించింది. దాంతో, 30 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం తంజిమ్ బ్రిట్స్(20), ఎలెనె బొస్చ్(0)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ, దీప్తి శర్మ తన తొలి ఓవర్లోనే తంజిమ్ వికెట్ తీసి సఫారీలను మరింత ఒత్తిడిలోకి తోసేసింది. బ్రిట్స్ స్ట్రెయిట్‌గా ఆడిన బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది.