ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ జోడీ తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల ద్వయం కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో క్రాస్టో-కపిల జోడీ 17వ ర్యాంకుకు ఎగబాకింది.
పురుషుల డబుల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్-చిరాగ్.. 11వ ర్యాంక్‌కు పడిపోగా త్రిసా-గాయత్రి జంట కూడా ఒక ర్యాంక్ దిగజారి పదో స్థానానికి పరిమితమైంది.