టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా అందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పరేడ్‌లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ టీమ్ అందరి కంటే ముందు ఉంటుంది. ఈసారి కూడా గ్రీస్ టీమ్ తరఫున షూటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటున్న అనా కొరకాకి, ఎలిఫ్‌తోరియోస్ పెట్రోనియాస్ గ్రీస్ జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచారు. జపాన్ భాష ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో టీమ్స్ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇండియన్ టీమ్ తరఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఈ పరేడ్‌లో పాలుపంచుకున్నారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బాక్సర్ మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో ముందు నడిచారు. ఎన్నడూలేని విధంగా ఈసారి 127 మంది అథ్లెట్ల బృందంతో ఇండియా వెళ్లినా.. ఓపెనింగ్ సెర్మనీలో మాత్రం వారి సంఖ్య 19కే పరిమితమైంది. ఒలింపిక్స్ చరిత్రలో కేవలం రెండోసారి మాత్రమే ఓ ఒలింపిక్ శరణార్థి టీమ్ పరేడ్‌లో పాల్గొన్నది.
For the second time in its history, the Olympic Games welcome the IOC Refugee Olympic Team!❤️
— Olympics (@Olympics) July 23, 2021
Leading the delegation into the stadium are the flagbearers, swimmer @YusraMardini and marathon runner Tachlowini Gabriyesos.#StrongerTogether #OpeningCeremony #EoR @RefugeesOlympic pic.twitter.com/ftVl2Kzd4H
Here they are 💪#TeamIndia at the #OpeningCeremony of #Tokyo2020 #Olympics pic.twitter.com/8K49eWliqF
— Doordarshan Sports (@ddsportschannel) July 23, 2021