మెడెలిన్: భారత ఆర్చర్ అభిషేక్ వర్మ ప్రపంచకప్ స్టేజ్-3లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. కొలంబియా వేదికగా శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగ ఫైనల్లో 33 ఏండ్ల అభిషేక్ 148-146తో అమెరికా ఆర్చర్ జేమ్ లడ్జ్పై విజయం సాధించాడు.
అభిషేక్ కెరీర్లో ఇది మూడో వ్యక్తిగత స్వర్ణం కాగా.. గతంలో 2015, 2021లోనూ అతడు బంగారు పతకాలు నెగ్గాడు. అంతేగాక ప్రపంచకప్ పోటీల్లో అభిషేక్ రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నాడు.