IND vs AFG : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భారత జట్టు (Team India) తొలి సమరానికి వేళైంది. అజేయంగా లీగ్ దశను ముగించిన రోహిత్ సేన కరీబియన్ గడ్డపై అఫ్గనిస్థాన్ సవాల్‌ను ఎదుర్కోబోతోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హిట్‌మ్యాన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఊహించినట్టుగానే సిరాజ్ స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్,
అఫ్గనిస్థాన్ జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హర్జతుల్లా జజాయ్, గుల్బదిన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, మహ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారుఖీ.
🚨 Toss & Team Update 🚨
Captain Rohit Sharma has won the toss & #TeamIndia have elected to bat against Afghanistan.
1⃣ change in our Playing XI as Kuldeep Yadav is named in the team.
Follow The Match ▶️ https://t.co/xtWkPFaJhD #T20WorldCup | #AFGvIND pic.twitter.com/QlcAJ0MMkd
— BCCI (@BCCI) June 20, 2024
వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ లోని టీమిండియా అజేయంగా సూపర్ 8కు దూసుకొచ్చింది. మరోవైపు అఫ్గనిస్థాన్ సైతం హ్యాట్రిక్ విజయాలతో రెండో దశలో అడుగుపెట్టింది. కానీ, చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ దెబ్బకు రషీద్ ఖాన్ సేన కుదేలైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. సంచలన విజయాలకు పెట్టింది పేరైన అఫ్గన్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు.