IND Vs ENG T20 | ఇంగ్లాండ్‌తో జరుగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. ఆల్‌రౌండర్లు నితీశ్‌కుమార్ రెడ్డి, రింకూ సింగ్ స్థానంలో ధ్రువ్ జురెల్, వాషింగ్టన్కు తుది జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు సైతం రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీ దూరమయ్యాడు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. సిరీస్‌పై పట్టు సాధించాలని భావిస్తున్నది. ఇక ఈ మ్యాచ్‌లోనైనా ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఇంగ్లాండ్ ఉన్నది.
భారత జట్టు : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.