కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టెస్టులో భారత మహిళల హాకీ జట్టు 5-1తో విజయం సాధించింది. గత యేడాది తరువాత జట్టుతో చేరిన మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ సత్తా చాటుతూ ఒక గోల్ చేసింది.
రాణి 12వ నిమిషంలో గోల్ సాధించగా, రెండో క్వార్టర్లో మోనిక 20ని.లో, నవనీత్ కౌర్ 24ని.లో, గుర్జీత్ కౌర్ 25ని.లో, సంగీత కుమారి 30వ ని.లో గోల్స్ చేశారు.