ఫస్ట్ టెస్ట్‌లో ఇండియా సూపర్ షో.. 113 రన్స్ తేడాతో సఫారీలపై గెలుపు

సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్‌లో 305 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీలు.. కేవలం 191 రన్స్‌కే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా, షమీలు చెరి మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్, అశ్విన్‌లు రెండే వికెట్లను పడగొట్టారు. సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్ 77, బవుమా 35 రన్స్ చేశారు. సెంచూరియన్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా.. ఈ ఏడాదికి స్వీట్ విక్టరీతో గుడ్‌బై చెప్పింది.
నిజానికి తొలి రోజే ఇండియా ఆధిపత్యాన్ని చాటింది. ఆ తర్వాత రెండవ రోజు వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. ఇక మూడవ రోజు ఏకంగా 18 వికెట్లు పడ్డాయి. అక్కడే మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్.. అద్భుతమైన సెంచరీతో ఇండియాను అదుకున్నారు. దాంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. కానీ వర్షం తర్వాత సెంచూరియన్ పిచ్ పూర్తిగా మారిపోయింది. ఆ పిచ్‌పై బౌలర్లు తమ సత్తా చాటారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియాను 174 రన్స్‌కే ఔట్ చేశారు సఫారీలు. ఇండియన్ బౌలర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లోనూ రాణించారు. సౌతాఫ్రికాను రెండసార్లు 200 స్కోర్ లోపే ఔట్ చేశారు. సెంచరీ హీరో రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
ఇండియా 327, 174
సౌతాఫ్రికా 197, 191
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- bumrah
- Centurion Test
- India
- kohli
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

