కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలకు క్రీడాకారులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్లు (మహిళల) కూడా మరోసారి ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచడానికి సిద్ధమవుతున్నాయి. జులై 31న ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది.
మహిళల క్రికెట్ జట్లు మాత్రమే పోటీ పడుతున్న ఈ మెగా ఈవెంట్ లో భారత జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఇందులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బోడస్ జట్లు కూడా ఉన్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ ను వేర్వేరు ప్రత్యర్థులతో ఆడుతున్నా రెండో మ్యాచ్ లో ఢీకొనబోతున్నాయి. టీ20 ఫార్మాట్ లో ఈ మ్యాచులను నిర్వహించనున్నారు.
జులై 31న హర్మన్‌ప్రీత్ సేన.. బిస్మా మరూఫ్ (పాకిస్తాన్ కెప్టెన్) సారథ్యంలోని పాక్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మేరకు ఇరు జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు.. పాక్ పై 107 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివరాలు :