ముంబై : న్యూజిలాండ్‌తో జరనున్న వాంఖడే టెస్టులో ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. వర్షం కారణంగా తొలి రోజు మొదటి సెషన్‌ను కోల్పోయారు. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్నది. ఈ మ్యాచ్‌కు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. తొలి టెస్టుకు రహానే సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రహానే, జడేజా, ఇశాంత్‌లకు రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానాల్లో కోహ్లీ, సిరాజ్, జయంత్లను తీసుకున్నారు. ఇక కివీస్ కెప్టెన్ విలియమ్సన్ స్థానంలో డారెల్ మిచెల్ వచ్చాడు.
ఇండియా జట్టు..
శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, సిరాజ్
కివీస్ జట్టు
విల్ యంగ్, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, రాచిన్ రవీంద్ర, కైలీ జేమీసన్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, అజాజ్ పటేల్