ప్యూబ్లా(మెక్సికో): ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-1లో భారత్ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత త్రయం వెన్నెం జ్యోతిసురేఖ, మధుర, ప్రగతి 233-232తో అమెరికాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.