కొలంబో : అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు.
ఫైనల్లో నేపాల్‌ను 114/5కే నియంత్రించిన మన అమ్మాయిలు.. ఛేదనను 12 ఓవర్లకే (117/3) పూర్తిచేసి టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫూలా సరెన్ (27 బంతుల్లో 44) రాణించింది. ఈ టోర్నీ సెమీస్‌లో భారత జట్టు.. ఆసీస్‌ను చిత్తుచేయగా పాకిస్థాన్‌ను ఓడించిన నేపాల్ ఫైనల్ చేరింది.