ఖాట్మాండు (నేపాల్) : దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ ప్యాడ్లర్లు పసిడి పతకాల పంట పండించారు. ఖాట్మాండులో ఆదివారం ముగిసిన పలు కేటగిరీలలో భారత్ ఏకంగా 13 స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. అండర్-19 బాలికలు, అండర్ -15 బాలికలు, అండర్-15 బాలుర విభాగంలో మూడు స్వర్ణాలు సాధించిన భారత్.. అండర్-19, అండర్-15 డబుల్స్‌లో ఏకంగా ఆరు బంగారు పతకాలతో మెరిసింది. అండర్-19 బాయ్స్, గర్ల్స్ సింగిల్స్ ఈవెంట్స్‌లో నాలుగు పసిడి పతకాలు దక్కాయి.